Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
కొవిడ్ మహమ్మారి సమ యంలో పోలీసులు ఎంతో మంది ప్రాణాలను కాపాడారనీ, వారి కృషి అభినందనీయమని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. కోవిడ్ సమయంలో రాచకొండ పోలీసుల కృషి, సేవల ను ప్రశంసించే ఉద్ధేశంతో రాచకొండ కమిషనరేట్లో మంగళవారం నేరేడ్ మెట్లోని హోంగార్డులకు కిరాణా కిట్లు అందజేశారు. నెస్లే ఇండియాతో భాగస్వామ్యంతో ఉన్న డాన్ బాస్కో 1030 కిరాణా కిట్లను అందజేశారు. ఇందులో బియ్యం, చన్నా డాల్, ఆట, సన్ ఫ్లవర్ ఆయిల్ మొదలైనవి ఉన్నాయి. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ డాన్ బాస్కో, నెస్లే ఇండియా సుమారు రూ.11 లక్షల విలువైన కిరాణా కిట్లు, ఒక్కో కిట్లో రూ.1100 విలువైన వస్తువులను విరాళంగా అందించడం పట్ల ప్రశంసించారు. కోవిడ్ సమయంలో రాచకొండ పోలీసుల కృషి, సేవలను గుర్తించినందుకు డాన్ బాస్కో, నెస్లే ఇండియాకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ సమయంలో రక్షించబడిన బాధితులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించడం ద్వారా పోలీసులకు సాయం చేస్తున్న డాన్ బాస్కోకు హైదరాబాద్లో పిల్లల గృహాలు ఉన్నాయని సీపీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మీడియాతో ఫాదర్ నోయెల్ మద్దిచెట్టి డైరెక్టర్, బోస్కోనెట్ మాట్లాడుతూ తాము ఇంతకు ముందు ఆహారాన్ని పంపిణీ చేశామనీ, డాన్ బాస్కో, నెస్లే ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా 6 మిలియన్ల కిట్లను పంపిణీ చేశామని చెప్పారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 20 వేల కిట్లను అందజేశామని తెలిపారు. కరోనా సమయంలో రాచకొండ కమిషనరేట్ పోలీసులు అవిశ్రా ంతంగా సేవలందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ కె.శిల్పవల్లి, అడిషినల్ డీసీపీ షమీర్, ఏసీపీ భాస్కర్ నాయక్, ఆర్ఐ అప్పల నాయుడు, నెస్లే ఇండియా కార్పొరేట్ వ్యవహారాల మేనేజర్ వార్సీ మెహమ్మద్ ఫాదర్, శరత్, తదితరులు పాల్గొన్నారు.