Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
గంజాయి అమ్మే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 1828 గ్రాములు ఉన్న గంజాయి మొక్కను స్వాధీనం చేసుకు న్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి మొక్కలు పెంచుతున్న బండి వీర వెంకట ప్రసాద్ అనే వ్యక్తిని నేరెడ్మెట్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. విలాసవంతమైన జీవితాన్ని ఆనందంగా గడపడానికి సాయి అనే వ్యక్తి గంజాయి మొక్కలను పెంచే ఐడియా ఇచ్చాడని ఒప్పుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం బండి వీర వెంకట ప్రసాద్ వినాయక్ నగర్, నేరెడ్ మెట్లో ఆరు నెలల నుంచి ఒంటరిగా ఉంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. జీవితాన్ని ఆడంబరంగా గడపడానికి తచ్చే ఆదాయం సరిపోనందున అదనపు డబ్బు సంపాదించాలనుకున్నాడు. నేరెడ్మెట్ వినాయక్‌నగర్‌లో ఉండే సాయి తో పరిచయం ఏర్పర్చుకున్నాడు. అదనపు డబ్బు ఎలా సంపాదిం చాలని అని అడగ్గా ఒక గంజా యి మొక్కను పెంచి దాని కొమ్మ లను అమ్ముతూ అదనపు డబ్బు పొందుతున్నట్టు తెలిపాడు. కొద్ది రోజుల క్రితం సాయి నుంచి గంజాయి మొక్క నుంచి రెండు కొమ్మలను తీసుకుని వాటిని ప్లాస్టిక్ బకెట్లో ఉంచి పెంచి దాని ఆకులు, పూలు అమ్ముతూ డబ్బు సంపాదించాడు. గురువారం మొక్కకు నీళ్లు పోస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను పోలీసులు, సిబ్బందిని నేరెడ్మెట్ సంతోషి మానగర్ కాలనీలో సాయి ఉండే ప్లాటుకు తీసుకెళ్లాడు. అక్కడ 8 అడుగుల ఎత్తు ఉన్న గంజాయి మొక్కను చూశారు. ఆ గంజాయి మొక్క, రెండు కొమ్మలను స్వాధీ నం చేసుకుని నింధితులను అరెస్టు చేసినట్టు నేరెడ్మెట్ సీఐ ఏ.నరసింహ స్వామి తెలిపారు.