Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
సిటీ కళాశాల శతాబ్ది వేడుకల్లో భాగంగా భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విస్త్రృత ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త శ్రీనివాసరావు ఉపగ్రహాల ద్వారా సమాచార విశ్లేషణ అనే అంశం పై ప్రసంగించారు. ప్రముఖ భౌతిక శాస్త్ర ప్రయోగశాల పరికరాల తయారీ సంస్థ ఫిసిటెక్తో కళాశాల ప్రధానాచా ర్యులు డాక్టర్ బాల భాస్కర్, ఫిసిటెక్ సంస్థ ప్రతినిధులు నరేందర్‌రెడ్డి వెంకటేశ్వర్లు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. దీనివల్ల తృతీయ సంవత్సర విద్యార్డులకు ఫిసిటెక్ సంస్థలో ప్రాజెక్టు చేసే అవకాశం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా డాక్టర్ నయన వినోదిని వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల భౌతిక శాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ వాసుదేవ రెడ్డి, డాక్టర్ చిన్నికృష్ణ, సుదర్శన్, విద్యార్ధులు పాల్గొన్నారు.