Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
విద్యార్థులకు పర్యావరణంపై పర్యావరణ పరిరక్షణే నా కల తీసుకోవడం బేస్ అని జిక్రా, అల్ ఫలాV్‌ా పాఠశాలల సెక్రెటరీ హఫిజ్ రషాదుద్దీన్ అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్ అదే నా కల అని వివరించేలా పలువురు పాఠశాలల చిన్నారులు వేసిన పెయింటింగ్స్ పర్యావరణ పరిరక్షణపై చైతన్య పరిచాయి. ఖిల్వత్ సద్భావన ఫోరం ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైస్కూలు స్థాయి చిన్నారులకు 'పర్యావరణం నా కల' అనే అంశంపై పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. 17 హైస్కూల్స్ విద్యార్థలు పాల్గొన్న ఈ పోటీల విజేతలకు గురువారం దూద్ బౌలీలోని ఓషిన్ హైస్కూల్లో విజేతలకు బహు మతులు అందించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకో వాలని సూచించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సద్భావన ఫోరం తరపున బహుమతులు అందించారు. ఈ సమావేశంలో సద్భావన ఫోరం ఖిల్వత్ అధ్యక్షులు పి.శ్రవణ్ కుమార్, ఖలీలుర్రహ్మాన్, ముహమ్మద్ యూసుఫ్ అలీఖాన్, మజీదుల్లా ఖాన్, గులామ్ మోయినుద్దీన్, ఓషిన్ స్కూల్ డైరెక్టర్ సుధా సోని, ఆమెర్ (పాయినీర్ హైస్కూల్), మంజూర్ అహ్మద్, ఫక్రుద్దీన్ అలీ తదితరులు పాల్గొన్నారు.