Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి గ్రామంలో అంబేద్కర్ భవన్‌తో పాటు అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాలను నెలకొల్పాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడుతూ దళితులంతా ఐకమత్యంతో కలిసి ఉంటూ బహుజనులను కలుపుకుని, రాజ్యాధికారం వైపు పయనించాలని సూచించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రవేశపెట్టే బిల్లును అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేకంగా డిసెంబర్-5 నుంచి 14వ తేదీ వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'హలో మాల - ఛలో ఢిల్లీ' పేరుతో ర్యాలీ, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. డిసెంబర్-5న ఢిల్లీలో చేపట్టబోయే నిరసన కార్యక్రమాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాల, మాల ఉపకులాలు అధిక సంఖ్యలో కదిలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమా వేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి, సీనియర్ నాయకులు తలారి కాశన్న, హనుమంతు, కుమార్, ఎం.వెంకటేష్, బ్యాగరి రాజు పాల్గొన్నారు.