Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత పొగాకు ఉత్పత్తులను మార్కెట్లో సరఫరా చేస్తున్న నింధితుడిని ఈస్ట్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నింధితుడి నుంచి రూ.57,07,640 విలువైన 1475 పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో డీసీపీ చక్రవర్తితో కలిసి సీపీ అంజనీకుమార్ వివరాలను వెళ్లడించారు. ఆంధ్రప్రదేశ్, కర్నూల్‌కు చెందిన డి.చిన్న నాగరాజు పదోతరగతి వరకు చదువుకున్న నింధితుడు స్థానికంగా సేల్స్మె న్గా పని చేశాడు. టీలు, బీడీలను సరఫరా చేస్తుండేవాడు. 2011లో హైదరాబాద్‌లో భారత్ బీడీ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్‌గా ఎంపిక చేశారు. పాన్‌షాపులు, డీలర్లకు బీడీలు, సిగరేట్లతోపాటు ఇతర పొగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు, ఇతర పొగాకు ఉత్ప త్తులను గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నాడు. ఉస్మాన్ గంజ్‌లో గోదాంను తీసుకుని అందులో నిల్వ చేస్తున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్సు పోలీసులు నింధితుడిని అరెస్టు చేశారు. నిషేధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.