Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
రాష్ట్ర సర్కారు వడ్లను కొనే వరకు రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటుందని చార్మినార్ నియోజకవర్గం ఇన్చార్జి కె.వెంకటేష్ అన్నారు. అన్నాతలను ఇబ్బంది పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామని అన్నారు. వడ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ పిలుపు మేరకు గురువారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ నుండి బషీర్‌బాగ్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన ర్యాలీలో సీనియర్ నాయకుడు జి. చిన్నారెడ్డి తో కలిసి వెంకటేష్ ప్లే కార్డులను పట్టుకొని నిరసన తెలియజేశారు.
నవతెలంగాణ-కూకట్పల్లి
కాంగ్రెస్ పాలనలో రాజులా ఉన్న రైతును, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీిఆర్‌ఎస్ ప్రభుత్వాల నాటకాలతో రోడ్డున పడేశారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కూకట్ పల్లి మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళ్ రావు అన్నారు. రైతులకు మద్దతుగా నిరసన ప్రదర్శన చేపట్టారు. పండిన పంటను కొనేవారు లేక పడిగాపులు కాస్తోన్న రైతుకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు. సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శనకు గొట్టిముక్కుల వెంగళ్ రావు, కూకట్ పల్లి నియోజకవర్గం నుండి భారీగా తరలివెళ్లారు.