Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
మండలంలోని ప్రతాప్ సింగారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కరుణ కుమారి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని కాలిన గాయాలతో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. పాఠశాల యాజమాన్య కమిటి, ఉపాద్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు గురువారం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటి చైర్మెన్ బద్దం కుమార్, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్, ఉపాధ్యాయులు ప్రభాకర్, పాండు, శ్రీనివాస్ రెడ్డి, భాగ్యలక్ష్మి, ఆనంద్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.