Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
అన్ని రంగాల్లో గ్రామాభివృద్ధే ధ్యేయంగా పాలకవర్గం నిరంతరం కృషిచేస్తుందని సర్పంచ్ నీరుడి గీత శ్రీనివాస్ అన్నారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయితీ పాలకవర్గం సాధారణ సమావేశం సర్పంచ్ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈసందర్భంగా గ్రామానికి బస్సు సౌకర్యం, ఎన్ఆర్జీఎస్ కింద వంద రోజుల పనికల్పించాడానికై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం 45 వేల మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టామని, ఇప్పటికే 25వేల మొక్కలకు ఫీడింగ్ చేయడం జరిగిందని అన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నీరుడి రామారావు, ఉపసర్పంచ్ కట్ట సత్యనారాయణ గౌడ్, కార్యదర్శి ప్రవీన్ కుమార్, వార్డు సభ్యులు నీరుడి హరీష్, నీరుడి లలిత, కట్ట కృష్ణగౌడ్, చింతపంటి జంగయ్య, శశిరేఖ, వెంకటనాగమణి, కోఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.