Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జేఎన్టీయూహెచ్్ విద్యార్థులు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
విద్యార్థులకు విశ్వవిద్యాలయంలో చదువుకునే వాతావరణం కల్పించాలని జేఎన్టీయూ హచ్ సీఈహెచ్ విద్యార్థులు అన్నారు. ఈమేరకు గురువారం కూకట్పల్లి జేఎన్టీయూహెచ్ వీసీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంత మంది అనధికార వ్యక్తులు, అరాచక శక్తులుగా మారి విద్యార్థుల మీద తప్పుడు కేసులు పెట్టాలని ప్రిన్సిపల్ కార్యాలయంలో ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కొంత మంది ప్రొఫెసర్ల వద్దకు వెళ్లి తమ వ్యక్తిగత పనులు చేయకపోతే దాడులు చేస్తామని బెదిరిస్తున్న కరుణాకర్‌రెడ్డి, రంజిత్, శ్రీనునాయక్, జగన్, భానుప్రకాష్‌లపై జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విశ్వ విద్యాలయం నుంచి సస్పెండ్ అయిన ఉద్యోగుల సైతం ధర్నాలో కూర్చొంటే ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోతే తమకు ప్రాణ హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో నవీన్, నాగరాజు, రోహిత్, శివతేజ, శేషు, అక్షయ, ఉమేష్, కీర్తన, మాజ్, విపుల్, అభినవ్, రేవంత్, దీరజ్, రుత్విక్, వర్షిత్ పాల్గొన్నారు.