Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో మూడు కోర్సులకు, ఈసీఈలో 1, కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో 1 పీజీ కోర్సుల అక్రెడిటేషన్ కోసం ఈనెల 26, 27, 28 మూడు రోజుల పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) టీం ఓయూలో పర్యటించనున్నారు. ఈమేరకు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. శ్రీరాం వెంకటేష్, ఆ విభాగాల హెడ్స్ ప్రొ. నిర్మల దేవి, ప్రొ. యేసురత్నం, ప్రొ. శ్యామల ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి వివిధ అంశాలపై ప్రిపరేషన్‌కు సన్నద్ధమతున్నారు. విభాగాల బలాబలాలు, ఏఏ అంశాల్లో వీక్‌గా ఉన్నారో వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే 'మాక్ పర్యటన' కూడా పూర్తి అయ్యింది సదరు టీమ్ విభాగాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వసతులు పరిశీలించి తర్వాత విభాగాల హెడ్స్, ప్రిన్సిపాల్ వారి ఎదుట ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ టీం ముందే రావాల్సి ఉంది కాని కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న ప్రిన్సిపాల్ ప్రొ. శ్రీరాం వెంకటేష్ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం గతంలో న్యాక్‌లో ఉత్తమ ర్యాంక్ పొందటమే కాకుండా, రుసా నిధుల తీసుకు రావడంలో కూడా అయిన విశేష కషి చేశారు. ఆయన అనుభవాలు ఎంత వరకు ఉపయోగ పడుతుందో వేచి చూడాలి. ఈమూడు విభాగల్లో అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది నిత్యం అక్రిడిటేషన్ పొందటానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరి ఎంత వరకు ఈ 5 పీజీ కోర్సుల్లో అక్రిడేషన్ పొందుతారో వేచి చూడాల్సిందే.