Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట/బడంగ్పేట్
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శుక్రవారం కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ళ పరిధిలోని శివాలయాలు శివ నామస్మరణతో మారు మ్రోగాయి. రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలో గురుమూర్తినగర్లోని శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయంలో ఉదయం నుంచే భక్తులతో కిటకిట లాడింది. అనంతరం ఆలయ ప్రధానార్చకులు ఆంజనేయ శాస్త్రీ స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఓంకార్రెడ్డి, బిజేపి మేడ్చల్ జిల్లా నాయకులు ఆశ, సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని శ్రీ శివ పంచాయతన సహిత శ్రీ శివ మార్కేండేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మెన్ జగద్గిరిగుట్ట పద్మశాలి సంఘం అధ్యక్షులు మునిపల్లి జనార్ధన్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గడ్డం జయరాం, గుర్రం మల్లేశం, రాంప్రసాద్, సుప్పాల వెంకటయ్య, అల్లి యాదగిరి, రాజ మహేందర్, రవి, వెంకటేష్, నగేష్, రంగ భాస్కర్, రంగ శ్రీరాములు, ఆంజనేయులు, బొడ రాజు, ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ నోముల రమేష్ ఋషి తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్ గూడలోని శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాం రెడ్డిలు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ చపిడి కొండల్ రెడ్డి, రామిడి శ్రీపాల్ రెడ్డి, రామిడి విరకర్ణా రెడ్డి, రామిడి మల్లారెడ్డి, రామిడి తుఫాన్ రెడ్డి, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామంలోని పురాతన చరిత్ర కలిగిన సంతాన వేణుగోపాల స్వామి, మహాశివుడుని దేవాలయాల్లో 15వ వార్డు కాంటెస్టెడ్ కార్పొరేటర్ విజరు కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, రంగారెడ్డి జిల్లా అద్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర నాయకులు మాజీ సింగిల్ విండో చైర్మెన్ కొలన్ శంకర్ రెడ్డిలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర సఫాయి కర్మచారి జాయింట్ కన్వీనర్ గడ్డం వెంకటేష్, బ్యాంక్ డైరెక్టర్ కళ్ళెం లక్ష్మారెడ్డి, కార్పొరేషన్ అధ్యక్షుడు చేరుకుపల్లి వెంకట్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, దడిగే శంకర్, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, గుండెపు ఇంద్రసేన, రామిడీ మాధురి వీరకర్ణ రెడ్డి, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి జొరల ప్రభాకర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గుండె నాగార్జున బాబు, బిజెవైఎం ఉపాధ్యక్షుడు క్యారగారి అరవింద్, సీనియర్ నాయకులు పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నవారు శ్రీనివాస్ రెడ్డి, క్యారగారి సంజీవ, దొడ్డి శ్రీశైలం, బీజేవైఏం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామిడీ సురకర్ణ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.