Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
నాడు తెలుగు పాటలు సుశీల, ఘంటసాల గళ మాధుర్యంతో సుసంపన్న మైనాయని తెలంగాణ రాష్ట్ర శాసన సభ తొలి సభాపతి ఎస్. మధుసూదనచారి అన్నారు. శతి లయ ఆర్ట్స్ అకాడమీ, సహదయ ఫౌండషన్ సీల్వెల్ నిర్వహణలో సినీ నేపథ్యగాయని పీ.సుశీల జన్మదిన వేడుక రవీంద్రభారతిలో నిర్వహించారు. సుశీల పాటలను అమని, శ్రావణి యుగళ గీతలతో సుభాష్, శ్రీనివాస్ లతో కలసి ఆలపించారు. అనంతరం జరిగిన సుభలో మధుసూదనాచారి మాట్లాడుతూ తెలుగు భాష లోని సాహిత్యం నాటి సినీ పాటల్లో అవిష్కతమవుతాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి(ఢిల్లీ) డాక్టర్ ఎస్. వేణుగోపాల చారి మాట్లాడుతూ నాటి పాటలను నేటి గాయకులు వేదికలపై పాడుతూ నేటి తరాలకు అందిస్తున్నారని అభినందించారు.పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, కళ పత్రిక సంపాదకులు రఫీ, వ్యాఖ్యాత గాంధీ తదితరులు పాల్గొన్న సభలో డాక్టర్ కే.హరినరాయన రెడ్డి ని ధార్మిక రత్న బిరుదుతో సత్కరించారు.