Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ మండల సహయ కార్యదర్శి కత్తుల దుర్గయ్య
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గుంతలమయంగా మారిన జగద్గిరిగుట్ట ప్రధాన రహదారిని వెంటనే బాగు చేయాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి కత్తుల దుర్గయ్య అన్నారు. శుక్రవారం జగద్గిరిగుట్ట డివిజన్ ప్రధాన రహదారిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జగద్గిరిగుట్ట శాఖ కార్యదర్శి సహదేవ్రెడ్డి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా జగద్గిరిగుట్ట ప్రధాన రహాదారిపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రోజు రోజుకు రోడ్డు కుంగిపోయి గుంతలు ఏర్పడడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతుందన్నారు. కొన్ని సందర్భాలలో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఈ రహదారి గుండా నాయకులు, అధికారులు రాకపోకలు సాగిస్తూ సమస్య పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి సమస్య పరిష్కరించాలని లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజలను సమికరించి సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్, ఏఐటీయూసీ నియోజకవర్గం అధ్యక్షులు హరినాథరావు,సీపీఐనాయకులు రాములు, నరేందర్చారి, జానకీరామ్ పాల్గొన్నారు.