Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓయూ జాక్ చైర్మెన్ దరువు అంజన్న
నవతెలంగాణ-కూకట్పల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని బాంబే కాలనీలో తెలంగాణ జాతిపిత, విశ్వకర్మ ముద్దుబిడ్డ ఆచార్య జయశంకర్ సర్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని ఓయూ జాక్ చైర్మెన్ దరువు అంజన్న అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం తొలి, మలి దశ ఉద్యమంలో తన జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి వెంటనే ఆ దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు.