Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత జాతీయ లోక్ దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పుల్లూరి వెంకట రాజేశ్వరరావు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దేశవ్యాప్త రైతుల ఆందోళనలతో రైతు వ్యతిరేక సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రైతులకు మాత్రం పాక్షిక ఉపశమనమేనని భారత జాతీయ లోక్ దళ్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు పుల్లూరి వెంకట రాజేశ్వరరావు అన్నారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాగు చట్టాల రద్దు రైతు, ప్రజా ఉద్యమ చారిత్రక విజయమన్నారు. ప్రధాని మోడీ శుక్రవారం సాగు చట్టాలను రద్దు చేస్తామని, రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో సాగు చట్టాలను రద్దు చేస్తామని చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు.అదే విధంగా కేంద్రం పంటకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ అనే రైతుల ఈ మూడు డిమాండ్లుపై వెంటనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన ప్రధాని మోడీని డిమాండ్ చేశారు.ప్రత్యామ్నాయ పంటలను, రైతులు పండించిన ప్రతి గింజను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసేలా కేంద్రం వారం రోజుల్లోగా అన్నదాతలకు అనుకూలంగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించే వరకు తమ పార్టీ పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు.