Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేటర్ స్వప్న జంగారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని 30వ డివిజన్ కార్పొరేటర్ బిమిడి స్వప్న జంగారెడ్డి అన్నారు. శుక్రవారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సుబ్రమణ్య కాలనీలో డెంగ్యూ, మలేరియా తదితర వైరల్ ఫీవర్లు, కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేయకుండా నిరంతరం ప్రజల సంక్షేమాన్ని కషి చేస్తుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేశంతో కార్పొరేషన్లో కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సుధాకర్, ఏఎంపీ పర్వీన్, ఆశావర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, నగరదీపికలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.