Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శాఖలో విలీనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తికొండ కిరణ్ అన్నారు. శుక్రవారం మల్కాజిగిరిలోని వీహెచ్ఎస్ఎస్ కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వర్గీకరణ పేరుతో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శాఖలో విలీనం చేసి వికలాంగుల ఆత్మ గౌరవం మీద దెబ్బతీశారన్నారు. 1983లో అప్పటి వికలాంగుల నాయకులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న స్వతంత్ర శాఖను విలీనం చేసింది కాక ఇప్పుడు వికలాంగుల డైరెక్టరేట్‌ను కూడా మహిళా శాఖలో విలీనం చేయ డాన్ని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర కమిటీ పూర్తిగా ఖండిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా విడుదల వారీగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీవీహెచ్ఎస్ఎస్ మేడ్చల్ జిల్లా ఇన్చార్జి మెరుగు శివకృష్ణ, టీవీహెచ్ఎస్ఎస్ మేడ్చల్ జిల్లా సలహాదారులు గోదా సంపత్, తదితరులు పాల్గొన్నారు.