Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం మోండా డివిజన్లోని శ్రీ వేంకటేశ్వర పెరుమాళ్ ఆలయంలో సత్యనారాయణ కథలు, పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయ ఈవో శ్రీనివాస్‌శర్మ ఏర్పాట్లు చేశారు.