Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 197వ జయంతి వేడుకలు స్వామి వివేకానంద సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో శుక్రవారం బోయినపల్లి ప్లే గ్రౌండ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోర్డు మాజీ ఉపా ధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఝాన్సీ రాణి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ప్రభుకుమార్‌గౌడ్, వివేకానంద అసోసియేషన్ అధ్యక్షుడు మద్ది భాస్కర్‌రెడ్డి, శషిరాజ్ యాదవ్, బోయిన దయానంద్ యాదవ్చ, మల్లేష్ యాదవ్, బి.కృష్ణ, ప్రకాష్ యాదవ్, రవీందర్, జ్ఞ్యాన ప్రకాష్, విశ్వనాథ్, బీజేపీ నాయకులు రాయల్ కుమార్, డాక్టర్ నంద కిశోర్, ముకేశ్, శ్రీనివాస చారి, సత్యనారాయణ, జయరాజ్, వెంకట్, పేరుకే మహే ందర్, నర్సింహా, వరప్రసాద్, షౌకత్ అక్తర్, సులేమాన్, షకీబ్, నరేందర్‌రెడ్డి, జంపన రవి, పవన్ పాల్గొన్నారు.