Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
గురునానక్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం కంటో న్మెంట్లోని క్లాసిక్ గార్డెన్లో ప్రకాష ఉత్సవ పేరిట.. సిక్కు మత పెద్దలు ఆరాధ్యదైవమైన కార్యక్రమాన్ని నిర్వహి ంచారు. గురునానక్ జయంతిని ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఆధ్యా త్మికంగా అంగరంగ వైభవంగా నిర్వహి స్తున్నట్టు సికింద్రాబాద్ గురుద్వారా సాహెబ్ అధ్యక్షుడు బల్దేవ్ సింగ్ తెలిపారు. ప్రకాష్ ఉత్సవ్ పేరిట గురునానక్ 552వ జయంతి వేడుకలు నిర్వహించారు. సికింద్రాబాద్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సిక్కు మతస్తులు అంతా ఒక చోటకి చేరుకుని విశాల్ దివాన్ పేరుతో సిక్కుల దైవమైన గురునానక్ ఆరాధనలు, పవిత్ర గ్రంథాలు శ్లోకాలు పఠనం చేశారు. ఈ వేడు వేడుకలకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్తోపాటు ఉత్తర మండల డీసీపీ కలమేశ్వర్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. సిక్కుల మత పెద్దలు వారి బోధనలు కీర్తనలతో లంగర్ కార్యక్ర మంతో క్లాసిక్ గార్డెన్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గురునాన క్ బోధనలలో ప్రతి ఒక్కరూ ఆచరించ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు. జాతీయ విస్తీర్ణం, శాంతి సౌభ్రాతృత్వం, ఐక్యత సోదరభావం వంటి సుగుణాలను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని మత బోధకులు తెలిపారు. ఈ సందర్భంగా వైైద్య శిబిరాలనూ ఏర్పాటు చేశారు.