Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
రక్త దానం చేయడం వల్ల అపాయంలో ఉన్న వారికి ప్రాణ దానం చేసినట్లు అని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. రెడ్ డ్రాప్ యువజన సేవా సమితి 10వ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన రెడ్ డ్రాప్ అవార్డ్స్-2021 ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిóగా పాల్గొని బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెడ్ డ్రాప్ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో మేమున్నాం అంటూ రక్తదానం, ప్లాస్మా దానం చేసే సేవా కార్యక్రమాలు చేస్తున్న అందరూ అభినందనీయులు అన్నారు. ఒకటి రెండు కాదు ఒక్కొక్కరు 10, నుంచి 100 సార్లు రక్తదానం చేస్తున్న రక్తదాతలు అందరినీ ఈ సందర్భంగా అభినందింస్తున్న అన్నారు. ప్రాణాపాయ స్థితిలో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుతున్న మీరు అందరూ బ్లెడ్ డోనర్స్ నిజమైన హీరోలు అని అన్నారు. మీరు చేసే ఈ సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం కూడా అందిస్తామని అన్నారు. వివిధ ప్రాంతాల్లో రక్త దానం చేసిన వారిని గుర్తించి, రక్త దానం ప్లాస్మా దానం చేసిన వారికి ఉత్తమ సేవా పురస్కారాలు, మెమెంటోలు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి. పట్నాయక్, స్వామి నాయుడు, అఖిల భారత చిరంజీవి యువత జాతీయ అధ్యక్షుడు, టౌన్ వైడ్ జనరల్ సెక్రటరీ షెఫీ ఉల్లా, టౌన్ వైడ్ ప్రెసిడెంట్ ఎస్. గులాం మహమ్మద్, టంగుటూరి రెహమాన్, ఏ.మహేందర్ రెడ్డి, నీరు ఠాకూర్, రేఖ, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.