Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీరాం కాలనీలో నిర్వహించే శ్రీ బ్రమరాంబిక శ్రీ మల్లికార్జున స్వామి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలకు రావాలని కోరుతు అదివారం కౌన్సిలర్లు పల్లపు శంకర్, కే.లక్ష్మీనారాయణతో పాటు ఆలయ కమిటీ అధ్యక్షులు పరమేశ్, సభ్యులు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నివాసంలో కలసి ఆహ్వానించారు. ఈనెల 24న ఆలయ ప్రాంగణంలో ధ్వజ స్తంభ ప్రతిష్టాపన ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం దేవాలయాల అభివద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిరంతరం ప్రజాసమస్యల పరిష్కారం కోసం కషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్య సలహాదారులు ఉష్కమూరి నిరంజన్, సభ్యులు గుర్రం ధన్రాజ్, మురళి, జల్పల్లి మున్సిపల్ మీడియా సెల్ కన్వీనర్ మాజీ అర్మిమెన్ వాసుబాబు, నాయకులు భీమ్, మారుతీ, నర్సింగ్, లింగం తదితరులు పాల్గొన్నారు.