Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో యువ ఖేల్ కడ్ మహాసింగ్ తెలంగాణ స్పోర్ట్స్ మీట్ వారు నిర్వహించిన అండర్-14, 17 ఖోఖో, చెస్, క్యారమ్ ఆటల పోటీల్లో సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద విద్యా మందిర్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచి మొదటి బహుమతిని గెలుపొందారని స్కూల్ హెచ్ఎం మండల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు మొదటి బహుమతి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు ఏ రంగాలపై ఆసక్తి ఉందో తెలుసుకొని ప్రోత్సహించడం వల్ల వారు జీవితంలో చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకుని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు తెచ్చినవారవుతారు అన్నారు. అనంతరం ఖోఖో, చెస్, క్యారమ్ ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల తరఫున ప్రశంసా పత్రం తోపాటు బహుమతులు ప్రదానం చేశారు. భవిష్యత్‌లో విద్యార్థులు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కరస్పాండెంట్ మండవ సునీత, పీఈటీ తిరుపతి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.