Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
శిల్పారామం, శ్రీ రాధికా సంగీత నత్య అకాడమీ, తెలంగాణ ప్రభుత్వం భాష సాంస్కతిక శాఖ సంయుక్త నిర్వహణ నాట్య గురువర్యులు రమణి సిద్ది, ఇందుమతి ఘంటి ''కూచిపూడి నత్య నీరాజనం ''సాంస్కతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరవ అతిధులుగా బేేతి సుభాష్‌రెడ్డి, కాచం సత్యనారాయణ, ప్రముఖ నాట్య గురువర్యులు సీత నాగ జ్యోతి, న్యూ ఢిల్లీ, ప్రముఖ నాట్య గురువులు డాక్టర్ పసుమర్తి శేషుబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కూచిపూడి నత్య నీరాజనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీత నాగ జ్యోతి శిష్య బందం ప్రదర్శించిన కూచిపూడి అంశాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పద్మభూషణ్ వెంపటి చినసత్యం రూపొందించిన వాణికి వందనం, జతిస్వరం, ఓరాశబ్దం, లింగాష్టకం, అన్నమయ్య కతి, శివరంగం, పూర్వ రంగం, అంశాలను ఎంతో ఆకర్షణీయంగా ప్రదర్శించారు. కళాకారులు అభినయ నాగజ్యోతి, శ్రీథనాయ శర్మ, సాయి శిరీష, అపర్ణ రెడ్డి, శ్రావ్య శేషాద్రి, చార్వి, మేఘ, పాల్గొన్నారు. ఇందుమతి ఘంటి శిష్య బందం ఎందరో మహానుభావులు, రామదాసు కీర్తన, హిమగిరి తనయ అంశాలను ప్రదర్శించారు. కళాకారులందరికీ సన్మాన కార్యక్రమం రమణి సిద్ధి నిర్వహించారు.