Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కురుమ సంఘం నాయకుల డిమాండ్
నవతెలంగాణ-ఉప్పల్
విధి నిర్వాహణలో విద్యుదాఘాతానికి గురై చనిపోయిన దేవరుప్పల మండలం కొలుపుల రవి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొరిగే రమేశ్ కురుమ, ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు రేవు కష్ణ కురుమ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఉప్పల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. చిలుకానగర్ ప్రాంతంలోని పలు ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఫిర్యాదు రావడంతో అక్కడకు వెళ్లి, విద్యుత్ స్తంభంపై మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై చనిపోయిన సంఘటన కలిచివే సిందని అన్నారు. హబ్సిగూడ డివిజన్ పరిధి చిలుకానగర్ సెక్షన్ అసిస్టెంట్ లైన్మెన్గా పని చేస్తున్న రవి కుటుంబం వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. సరియైన భద్రత తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసు కుందని, బాధ్యులైన అధికా రులపై చర్యలు తీసుకో వాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.
బాధితులకు న్యాయం చేయకపోతే కురుమ సంఘం తరుఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉప్పల్ కురుమ సంఘం అధ్యక్షుడు గొరిగే ఐలయ్య కురుమ, సెక్రటరీ కర్రె శ్రీనివాస్ కురుమ, శ్రీ బీరప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్ చిందం వెంకటేశ్ కురుమ, గొరిగే నర్సింహ కురుమ తదితరులు ఉన్నారు.