Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
మైనార్టీల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి వివక్ష తగదని ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ అన్నారు. ఆదివారం కిషన్‌బాగ్‌లో ఆవాజ్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందన్నారు. కరోనా కాలంలో ముస్లిం మైనార్టీలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యార న్నారు. ఆటో డ్రైవర్లు అడ్డాలపై, కార్మికులు, ఇండ్లలో పనిచేసే మహిళలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులకు సమస్యల సుడిగుండంలో వదిలేసిందన్నారు. రాబోయే రోజుల్లో తన హక్కులు సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారన్నారు. ఫైనాన్సర్ల ఆగడాలు ఎక్కువయ్యాయని, ఆటో డ్రైవర్లు గిరాకీలు లేక ఇల్లు నడవడం కష్టంగా మారిందన్నారు. కిరాయిలు కట్టలేని పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు సహకారం చేయాలని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ మొద్దునిద్ర వీడలేదని, ఎలాంటి సహకారం చేయలేదని ఆరోపించారు. ముస్లిం మైనార్టీలకు తక్షణమే లోన్లు ఇవ్వాలని, మైనారిటీ బంధు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నూతన ఆవాజ్ యాక్షన్ కమిటీ 17 మందితో ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా సయ్యద్ అహ్మద్ అలీ, కార్యదర్శిగా షేర్ యాకూబ్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ ఇస్మాయిల్ ఉద్దీన్, షేక్ యూసుఫ్, షేక్ రుక్నుద్దీన్, సహాయ కార్యదర్శులుగా మహమ్మద్ అఖీబ్, మొహమ్మద్ ఆజఖాన్, సయ్యద్ ఇబ్రహీం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మొహమ్మద్ సలీం, మొహమ్మద్ సాఖిబ్, కమిటీ సభ్యులుగా షేక్ అనీస్, షేక్ మొయినుద్దీన్, మహమ్మద్ ముస్తఫా షేక్ మహబూబ్ బాషా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నగర నాయకులు బాబర్ ఖాన్ పాల్గొన్నారు.