Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సక్సెస్ స్కూల్ డైరెక్టర్ మహ్మద్ షుజవుద్దీన్
నవతెలంగాణ-బడంగ్పేట్
పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదుగాలని సక్సెస్ స్కూల్ డైరెక్టర్ మహ్మద్ షుజవుద్దీన్ అన్నారు.
శుక్రవారం జల్పల్లి మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలోని సక్సెస్ స్కూల్లో బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా కోవా పీస్ నెట్వర్క్ అవార్డ్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు.10వ తరగతి విద్యార్థి సుమయ్య ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యార్థులను విద్యతో పాటు వివిధ రంగాల్లో రాణించే విధంగా కషి చేసిన ఉపాధ్యాయులు అర్షియా, అయొషా, హజ్రాలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో అవార్డులు అందుకోవాలని కోరుకుంటున్నానని అయన తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే ఇంకా ఎన్నో విజయాలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రిన్సిపల్ అతియా ఫాతిమా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని గొప్పవారు కావాలని కోరారు. సుమయ్యను పాఠశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.