Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
తండ్రి కారు కింద పడి కొడుకు మతి చెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మన్సు రాబాద్ పరిధిలోని కాస్మోపాలిటన్ కాలనీలో నివాసం ఉంటున్న అంగీర్ల రాణి, లక్ష్మణ్‌లకు 5సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి స్వస్థలం జహీరాబాద్ మండలం, సంగారెడ్డి జిల్లా. ఏడాది క్రితం కాస్మోపాలిటన్ కాలనీకి మకాం మార్చారు. వారికి ఇద్దరు సంతానం. భవానికి 4సంవత్సరాలు. సాత్విక్‌కు ఏడాదిన్నర. ఆదివారం తన ఇంట్లో నుండి ఇన్నోవా క్రిస్ట కారు టీఎస్ 08 జీఎం 2277 ను వెనక్కి తీసుకుంటున్న క్రమంలో కారు ముందు టైర్లో సాత్విక్ పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.