Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు తమ ఓలా ఎస్1, ఎస్1 ప్రోస్కూటర్ కోసం కస్టమర్ టెస్ట్ రైడ్స్ ప్రారంభించింది. తొలుత రూ.20వేలు లేదా పూర్తి స్థాయి చెల్లింపులు జరిపిన వినియోగదారులకు ఈ టెస్ట్ రైడ్‌లో తొలి ప్రాధాన్యం అందిస్తున్నారు. ప్రాధాన్యతా డెలివరీ సైతం అందిస్తున్నారు. ఈ టెస్ట్ రైడ్స్ ముంబై, పూనె, చెన్నై, హైదరాబాద్, కొచ్చిలోని వినియోగదారులకు అందిస్తున్నారు. త్వరలోనే మిగిలిన నగరాల్లోనూ ఈ రైడ్స్ ప్రారంభం కానున్నాయి. హైదరా బాద్‌లో ఈ రైడ్ క్యాంపును కృష్ ఎమరాల్డ్ (విరు వర్క్), కొండాపూర్ మెయిన్ రోడ్డు, లక్ష్మీ సైబర్ సిటీ, వైట్ ఫీల్డ్, కొండాపూర్‌లో నిర్వహించారు. ఓలా ఎస్1 ఎస్1 ప్రోను ప్రపంచం కోసం భారతదేశంలో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ వద్ద తయారు చేస్తున్నారు. పరిశ్రమలో పలు అగ్రశ్రేణి ఫీచర్లు అయిన అత్యుత్తమ డిజైన్, అత్యుత్తమ సాంకేతికత, అత్యుత్తమ పనితీరు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 10 వినూత్నమైన, ఆహ్లాదకరమైన రంగులను ఓలా ఎస్1 ప్రో 5 కలర్స్‌ను ఓలా ఎస్1 కోసం అందిస్తుంది.