Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
ఎలీమ్ మెనోనైట్ బేథెర్న్ చర్చి రాజు కాలనీ బాలానగర్ వారు ఆదివారం ప్రపంచ సండే స్కూల్ డే ను సూపరింటెండెంట్ ఎం.ఝాన్సీ రాణి అధ్యాపకులు బి.మరియమ్మ, జి.హెప్సిబాV్‌ా, బి.సంతోషి, సుశీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ప్రేమ్ కుమార్ పగడాల విచ్చేసి దేవుని సువార్త బోధించారు. ఈ సందర్భంగా సండే స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు పాటలు పడుతూ, దేవుని వాక్యాలు చెపుతూ దైవ ఆరాధనని ముందుకు కొనసా గించారు. ఈ వేడుకల్లో సంఘ పాస్టర్. వై.జి. కిషోర్, కమిటీ సభ్యులు ఎమ్.పి. ప్రభుదాస్, ప్రధాన కార్యదర్శి బి.సుదర్శనం, ఉపాధ్యక్షుడు ఎమ్.జె.పరంజ్యోతి, కోశాధి కారి జి.సంజీవ్, బి. శాంసన్, ప్రభుదాస్, ఎమ్.శాంసన్, ఎమ్.జ్యోతి బాబు, బి.విజరు కుమార్, మరిళ్ల పరంజ్యోతి సంఘ సభ్యులు పాల్గొన్నారు.