Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరర్
ఉత్తముల పేరిట అర్హులకు అందించే పురస్కారం స్వర్ణానికి సువాసనలు అద్దినట్టుగా ఉంటుందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్ అన్నారు. కళాకారులను గాన సభ వేదికనిచ్చి ప్రోత్స హించిన కళా సుబ్బారావు పురస్కారం కళా సంస్థలకు ఆప్త బంధువు విజయ కుమార్‌కు బహుకరించటం స్వర్ణానికి వాసన అద్దినట్టేనని ఆయన అభివర్ణించారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళావేదిక పై ఆదివారం ఎందరో మహానుభావులు శీర్షికన గాన సభ పూర్వ అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త కళా సుబ్బారావు వర్దంతి సుమావేశం జరిగింది. సుబ్బారావు స్మారక కళా పురస్కా రాన్ని కళా సౌజన్యమూర్తి విజయకుమార్‌కు ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర బేవరీ జస్కార్పొరేషన్ పూర్వ చైర్మెన్ దేవి ప్రసాద్ బహుకరించారు. ముఖ్య అతిధిగా శ్రీధర్ హాజరై మాట్లాడారు. కళా సుబ్బారావు కళాకారుల పట్ల ఆదరణ భావంతో ఉండేవారనీ, విజయకుమార్ మానవీయ కోణంలో వారిని ఆదరిస్తారని విశ్లేషించారు. దేవిప్రసాద్ మాట్లాడుతూ కళా సబ్భారావు తనయులుగా గతంలో దీక్షితులు ప్రస్తుత అధ్యక్షులు జనార్ధనమూర్తి గాన సభను నిత్య నూతనంగా తీర్చిదిద్దారని అభినందించారు. వంశీ సంస్థల అదినేత వంశీ రామరాజు, కిన్నెర సంస్థ స్థాపకులు కిన్నెర రఘురామ్ మాట్లాడుతూ విజయకుమార్లో కళల పట్ల అనురక్తి, సహృదయత ఎన్నతగిన వని ప్రశంస ించారు. కళా సుబ్బారావుతో తమకున్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన విగ్రహం గాన సభ ప్రాంగణంలో ప్రతిష్టించాలని కోరారు. అధ్యక్షత వహించిన జనార్ధనమూర్తి మాట్లాడుతూ గాన సభలో భిన్న రంగాలకు చెందిన ప్రఖ్యాత కళాకారుల తైల వర్ణ చిత్రపటాలను ఏర్పాటు చేసిన విజయకుమార్ నిస్వార్థ కళా పోషకులని కొనియాడారు. విజయ కుమార్ మాట్లా డుతూ కన్న బిడ్డలకు సంపద కంటే సంస్కారం, విద్య ఇవ్వాలన్నారు. సంపాదించిన సంపద లో కొంత సుమజానికి ఇస్తే శాశ్వత కీర్తి సంపద మరణించినా నిలిచివుంటుందన్నారు. దేవ సేన, జర్నలిస్ట్ పొత్తూరి సుబ్బారావు పాల్గొన్నారు.