Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని కుత్బుల్లాపూర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బంటు నరేష్ అన్నారు. రైతు పోరాటంలో అసువులు భాసిన రైతు సోదరులకు సంఘీబావంగా తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కంది శ్రావణ్ కుమార్రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం చింతల్ మాణిక్యనగర్లో బంటు నరేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నివాళ్లర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరే కంగా అవిశ్రాంతంగా పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నల్ల చట్టాలను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతుతో రైతు సోదరులు రద్దు చేయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు రమేష్గుప్తా, రామ్గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు సుజనాకర్రెడ్డి, ప్రమోద్, ప్రేమ్, నూతన్, సాయి, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.