Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్లో గల మహాత్మాగాంధీ కమ్యూనిటీ హాల్లో ఆర్ఎన్సీ మల్టీ స్ఫెషాలిటి హాస్పిటల్ సహకా రంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పం దన లభించింది. ఈ కార్యక్రమానికి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జల్దా రాఘవులు హాజరై ప్రారంభి ంచారు. ఈ వైద్య శిబిరంలో మధుమేహం, బీపీ, కీళ్ల నోప్పుల వైద్యులు పాల్గొని సుమారు 200 మందికి వైద్య పరీక్షెలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన డాక్టర్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జల్దా లక్ష్మీనాథ్, నాయకులు శ్రీనివాస్, వాజిద్, తిమ్మయ్య, నీలగిరి, జగన్, విజరు, శ్రీను, మురళీ, పాయి, ఆనంద్, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.