Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ సర్కిల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మదిగ పిలుపు మేరకు ఈనెల 26న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఎన్ వినరు ఆదివారం కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2007 ఆగస్టు 28న వికలాంగుల ఆత్మ గౌరవ రాజ్యాధికారం కోసం భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ఆవిర్భవించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. వికలాంగుల, వృద్దాప్య పించన్ను రూ.6 వేలకు పెంచా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వరూప చారి, జి.సురేష్, ఎం.మల్లేష్, షేక్ షబానా, ఎండీ సల్మాన్ జి.సాయి కుమార్, కేబీ జయ హరి హజరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.