Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదుగాలని గౌతమీ విద్యా సంస్థల చైర్మెన్ కె.రవీందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చింతల్ డివిజన్ పరిధిలోని పట్వారీ ఎన్‌క్లేవ్‌లో గల గౌతమి కళాశాల అవరణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గౌతమి, అనుదీప్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో అకాడమిక్ ఎక్స్‌లెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు గౌతమి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.హేమలతరెడ్డి పాల్గొని గతేడాది డిగ్రీ కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటో, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యంతో కూడిన చదువు చదివితే అనుకున్న గమ్యాన్ని చేరుకుం టారని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఓత్తిడిలకు లోను కాకుండా క్రమశిక్షణతో చదువాలని అప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలరన్నారు. ఈ కార్యక్రమంలో అనుదీప్ ఫౌండేషన్ సెంటర్ మేనేజర్ మిథున్ ప్రసాద్, అధ్యాపక బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.