Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఈ నెల 24 నుంచి 30 తేదీ వరకు వారం పాటు నల్ల కుంటలోని శంకర మఠంలో శ్రీ పూర్ణ యజ్ఞ కళా పీఠం, కిన్నెర ఆర్ట్స్ థియేటర్ సంయుక్త నిర్వహణలో శంకర మఠం సౌజన్యంతో హరి కథ సప్తాహం నిర్వహిస్తున్నట్లు రస రంజని అధ్యక్షులు డాక్టర్ కేవీ రమణ, కార్యదర్శి ముట్నూరు కామేశ్వర రావు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ హరికథలతో ప్రతి రోజు సాయంత్రం కార్యక్రమ ఉంటుందని దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సప్తహాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ముట్నూరు యజ్ఞనారాయణ శర్మ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నట్లు కామేశ్వర రావు తెలిపారు.