Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ మండలంలో ప్రయివేట్ పాఠశాలలు పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా నడుపుతున్నారని, కరోనా కాలంలో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 46లో తుంగలో తొక్కి చాలా పాఠశాలలు నడుపుతున్నాయని ఉప్పల్ నియోజకవర్గం అధ్యక్షులు ఖాసిం జాలం, మండల కార్యదర్శి మణికంఠ అన్నారు. రామంతపూర్ వికాస్ నగర్ లో ఉన్న సాయి వికాస్ హై స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ పాఠశాలకు 7వ తరగతి వరకు మాత్రమే పర్మిషన్ ఉందని, పదవ తరగతి వరకు అరణ్య పాఠశాల మీద నడుపుతున్నారని చెప్పారు. కానీ విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే కేవలం పేరు మాత్రమే మార్పు చేసుకున్నామని కట్టుకథలు అల్లుతున్నారని, అలాగే పాఠశాలల్లో వసతులు కూడా సరిగ్గా లేవని, పాఠశాలలో కనీసం క్వాలిఫై అయిన టీచర్లు కూడా లేరని చెప్పారు. వీటిపై తక్షణమే ఎంఈఓ, డీఈఓ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శివ, రాజేష్ పాల్గొన్నారు.