Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
బంజారా బాలికలు, మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడుల నివారణకు కు కఠిన చర్యలు చేపట్టి, దోషులను గుర్తించి కఠినంగా శిక్షించడం తోపాటు ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా ప్రత్యేక చట్టం తేవాలని స్వామి నాయక్ మెమోరియల్ సొసైటీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎంపవర్మెంట్ కమిటీ కన్వీనర్ శశికళ డిమాండ్ చేశారు. సోమవారం అబిడ్స్‌లోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్వామి నాయక్ మెమోరియల్ సొసైటీ కన్వీనర్ ఎస్ తారాచంద్, ప్రతినిధులు అమిత రాణి, మాధవి లతో కలిసి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో బంజారా బాలికలు, మహిళలపై లైంగిక దాడులు అధికంగా జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సోమాజిగూడా ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాలతో బంజారా బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మద్యం, మత్తు పదార్థాలు సేవించే సందర్భంలో తరచుగా ఇలాంటి ఘటన చోటు చేసుకుంటున్నందున మద్యం విక్రయాలు, మత్తుపదార్థాల విక్రయాలు వినియోగంపై దష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విషయాలపై ప్రభుత్వం విస్తతంగా ప్రచారం నిర్వహించి ప్రజల్లో ఇలాంటి దురలవాట్లను దూరం చేసేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. లైంగిక బాధితుల సహాయార్థం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ కేటాయించి ఎప్పటికప్పుడు ఘటనల వివరాలు, నివేదికలతో పాటు బాధితులకు అందుతున్న న్యాయం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి సమీక్షించే లా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్‌ను కోరనున్నట్లు తెలిపారు.