Authorization
Wed April 02, 2025 10:50:09 pm
నవతెలంగాణ-కల్చరల్
శ్రీశ్రీ భార్గవ నాట్య కళా మండలి నిర్వహణలో రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ , చలనచిత్ర, రంగస్థల అభివద్ధి సంస్థ, శంగేరి శంకర మఠం సౌజన్యంలో రెండు రోజులు శంకర మఠం ప్రాంగణంలో రెండు పౌరాణిక పద్య నాటకాలు ప్రదర్శించారు. తొలి రోజు తిరుపతి వెంకట కవుల 'పాండవో ద్యోగ విజయాలు', లోని ' శ్రీ కష్ణ రాయబారం' దశ్యాన్ని ప్రదర్శించారు. శ్రీ కష్ణుడుగా నారాయణ స్వామి, దుర్యోధనుని గా రాం ప్రసాద్, కర్ణునిగా మల్లాది రమణ, భీష్మునిగా శేఖర్, దతరాష్ట్రునిగా మూర్తి ఇతర పాత్ర దారులు పాత్రోచితంగా నటించారు. రెండవ రోజు ' గయో పాఖ్యానం' నాటకాన్ని ప్రదర్శించారు. రమునిగా నారాయణస్వామి, అర్జునునిగా కష్ణ శాస్త్రి పద్యాలను పోటా పోటీగా పాడి ప్రేక్షకులను అలరించారు. అతిథులుగా భాగి శాస్త్రి, పొత్తూరి సుబ్బారావు, క్రమాధాటి వెంకటేశ్వర శర్మ, కె.వీ.శ్రీనివాస్, ఏ. వీ.రమణ మూర్తి తదితరులు పాల్గొని నటులను అభినందించారు.