Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ సరస్వతి నగర్ అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు, గర్భిణులకు భోజనం చేసేందుకు ప్లేట్స్ కావాలని అంగన్ వాడీ టీచర్ సంధ్య రాణి దాతల సాయం కోరారు. తక్షణమే స్పందించిన టీఆర్ఎస్ నాయకులు గంధం నాగేశ్వరరావు అంగన్వాడీ సెంటర్కు 20 ప్లేట్స్, 20 గిన్నెలు అందజేశారు. పిల్లలకు సంబంధించి ఎటువంటి సమస్యకైనా సహాయం చేస్తామని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాంతాల నారాయణ రెడ్డి, కెఎన్ చారి, బంగ్లా శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.