Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
ఈనెల 24వ తేదీన నిర్వహించనున్న బీసీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలోమాట్లాడుతూ బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వివిధ బీసీ కుల లకు నిధులు కేటాయించినా వాటిని ఖర్చు పెట్టడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. నాయీ బ్రాహ్మణుల అభివద్ధి కోసం రూ. 250కోట్లు కేటాయించిన ఖర్చు చేయలేదన్నారు. బీసీ కులాల సమస్యలపై 24వ తేదీన చేపట్టిన ధర్నాలో బీసీల అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సెల్ రాష్ట్రకన్వీనర్ పసుపుల వికాస్ కుమార్, సంజరు గణటే, సుధాకర్, వెంకటేష్ పాల్గొన్నారు