Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
మొదటి డోసు తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండవ డోసు తీసుకోవాలని కార్పొరేటర్ గీత అన్నారు. సీఎం కేఆర్ ప్రతి ఇంటికీ వ్యాక్సినేషన్ అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారని, ప్రతిఒక్కరు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. డివిజన్లోని అజ్మత్ నగర్, హై కోర్ట్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, సీతారామ కాలనీ, టీచర్స్ కాలనీ లో ఇంటింటికి సర్వే చేసి వ్యాక్సిన్ ఇస్తున్నారన్నారు. షెడ్యూలు ప్రకారం డివిజన్లోని ప్రతి ఇంటినీ సర్వే చేసి వ్యాక్సినేషన్ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, వి బి నర్సింహ, ఎదుల కొండల్ రెడ్డి, రాంరెడ్డి, డివిజన్ జనరల్ సెక్రెటరీ కోకొండ జగన్, బాణాల నారాయణరెడ్డి, మాస శేఖర్, బింగి శ్రీనివాస్, అల్లిబిల్లి మహేందర్, శ్యామ్, బాలు పాల్గొన్నారు.