Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఓరియంటేషన్ డే వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ సాయి సత్యనారాణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక విద్య, దాని ప్రాముఖ్యత గురించి తెలుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం క్రమక్రమంగా విస్తరిస్తుండడంతో విద్యార్థులు ఆ దిశగా అడుగులు ముందుకు వేయాలని సూచించారు. మనిషి జీవన విధానంలో సాంకేతిక విద్య ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపై పరిశోధాత్మకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు సంబంధించిన పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. కళాశాల వైస్ చైర్మెన్ అనంతుల హదరు రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో కొత్తగా ప్రవేశపెట్టిన సీఎస్ఈ-ఏ ఐ అండ్ ఎంఎల్ అండ్ సీఎస్ఈ-డీఎస్ కోర్సుల వివరాలు, వాటి ప్రాధాన్యత గురించి వివరించారు. కార్యక్రంలో కళాశాల కార్యదర్శి రవీంద్రనాథ్ యాదవ్, చైర్మెన్ అనంతుల వినరు కుమార్ రెడ్డి, వివిధ విభాగాల హెచ్ఓడీ'లు, ఫ్యాకల్టీ, ఏవో రాజు, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.