Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
అభివద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈమేరకు సోమవారం కాచిగూడ డివిజన్ పరిధిలోని చప్పల్ బజార్లో లింగంపల్లి నుంచి హరి మజీద్ వరకు ఏర్పాటు చేయనున్న నూతన మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత లోపం లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పైప్ లైన్ ఏర్పాటు చేయడం ద్వారా చప్పల్ బజార్, పరశురామ్ యాదవ్ గల్లీ, గ్యాస్ కంపెనీ లైన్, నారాయణ డాక్టర్ లైన్, హరి మజీద్ లైన్, అలీ మజీద్ లైన్, శివ టెంపుల్ లైన్ మొదలైన చుట్టు పక్కల బస్తీల్లో మంచినీటిలో ప్రెషర్ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏఈ భావన, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ యాదవ్, సీనియర్ నాయకులు డాక్టర్ శిరీష యాదవ్, కాచిగూడ డివిజన్ ప్రెసిడెంట్ భీష్మ, నాయకులు దాద్రికు నాగేందర్ బాబ్జీ, వెంకట్, మహేందర్, దినేష్ పాల్గొన్నారు.