Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
కాంట్రాక్ట్ సూపర్వైజర్ రాజు పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు మీనా. పి నాగేశ్వర్ అన్నారు. సోమవారం కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉస్మానియా మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సూపర్వైజర్ రాజు తోటి కాంట్రాక్ట్ కార్మికులను (వర్కర్లు) వేధిస్తున్నారని, పీఎఫ్ డబ్బులు రావాలంటే తనకు 1,000 నుంచి 1500 వరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వర్కర్లను వేధిస్తున్నారని తెలిపారు. వెంటనే సూపర్వైజర్ రాజు పై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌కు వివరించారు.లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.