Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీసీ ప్రొ. సంజీవ్ కుమార్ శర్మ
నవతెలంగాణ-ఓయూ
ప్రస్తుత విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఉన్నత విద్యలో స్కిల్స్‌తో పాటు మోరాలిటి కూడా తప్పనిసరిగా ఉండాలని మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ, బీహార్ వైస్ ఛాన్సలర్ ప్రొ. సంజీవ్ కుమార్ శర్మ అన్నారు సోమవారం డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో'ఉన్నత విద్య-సవాళ్లు' అనే అంశం పై టాక్ నిర్వహించారు. యూనివర్సిటీలు జ్ఞాన కేంద్రాలుగా వర్ధిల్లాలాలంటే టీచర్స్ విద్యార్థులలో జిజ్ఞాసను రేకెత్తించాలన్నారు. ఈకార్యక్రమానికి ప్రొ. జాడి ముసలయ్య అధ్యక్షత వహించగా డా. చలమల వెంకటేశ్వర్లు స్వాగతం పలుకగా, డా. రాజేష్ కోట, వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పారు. కార్యక్రమంలో మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ. వైఎస్ చాన్సలర్ రిటైర్డ్ ప్రొ. జి. గోపాల్ రెడ్డి, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. అనుపమ, డిపార్ట్మెంట్ బి.ఓ.ఎస్, ప్రొ. చంద్రు, ప్రొ.అడపా సత్యనారాయణ, ప్రొ. అర్జున్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.