Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రైతు ఉద్యమంలో చనిపోయిన ఉత్తర భారతదేశ రైతులకు మూడు లక్షల చొప్పున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎక్స్ గ్రేషియా చెల్లించడం స్వాగతిస్తున్నామని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరభారత రైతులకు సహాయం అందించే ముందు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరికీ ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వారందరికీ ఎక్స్గ్రేషియా చెల్లించాలని కాకుండా వారి కుటుంబానికి ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో వైస్ చైర్మెన్ పరిగి రాములు, దక్షిణ భారత విద్యార్థి పరిశోధక జేఏసీ కన్వీనర్ దుర్గం శివ పాల్గొన్నారు.