Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఈనెల 14 నుంచి 21 వరకు కర్ణాటక రాష్ట్రం మైసూర్లో జరిగిన ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరంలో ఓయూ వాలంటీర్లు సత్తాచాటారు. మొత్తం ఆరు రాష్ట్రాలకు చెందిన 150 మంది పాల్గొనగా ఓయూ నుంచి 10 వాలంటీర్లను ఎంపిక చేశారు. ఓయూ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయలను ప్రదర్శించారు. వీరిలో ఉత్తమ వాలంటీర్‌గా డి.మహేందర్, ఉత్తమ ప్రోగ్రామ్ అధికారిగా డా.పల్లాటి. నరేష్, ఉత్తమ జట్టుగా ఓయూ, ఉత్తమ ప్రసంగంగా దుర్గా ఎంపికయ్యారు. సోమవారం ఓయూ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ ప్రొ. సవిన్ సౌడ ఆధ్వర్యంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొ. పి.లక్ష్మీనారాయణను కలిసి గెలుచుకున్న షీల్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. కార్యక్రమంలో ఓయూ స్టూడెంట్ డీన్ ప్రొ. రాజేందర్ నాయక్, డా.పల్లాటి.నరేష్ పాల్గొన్నారు.