Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఓల్డ్ బోయిన్పల్లి మండల ప్రజా పరిషత్ పాఠశాలను మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నర్సింహా యాదవ్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యా యులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏడేండ్లుగా పాఠశాల కరెంట్ బిల్లులు చెల్లించలేదని విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పడంతో ఎమ్మెల్యే, కార్పొరేటర్ వారి సొంత నిధుల నుంచి కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించారు. ఎమ్మెల్యే రూ.33 వేలు, కార్పొరేటర్ రూ.10 వేల చొప్పున కరెంట్ బిల్లు చెల్లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనీ, నిధుల కొరత ఉండటం వల్ల ప్రభుత్వం కరెంట్ బిల్లు చెల్లించలేకపోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ అరవింద్‌రావు, వాటర్ వర్క్స్ ఏఈ తేజ, ఎలక్ట్రికల్ ఏఈ పెంటయ్య నాయక్, మార్కెట్ యార్డు మాజీ చైర్మెన్ నరేందర్‌గౌడ్, నియోజకవర్గ అధ్యక్షులు ఇజాజ్, మాజీ కౌన్సిలర్ మక్కల నర్సింగ్, బలరాం, గడ్డం నర్సింగ్, మల్లేష్, డివిజన్ జనరల్ సెక్రెటరీ హరినాథ్, పోచయ్య, శ్రీనివాస్, ఉదరు, చారి, గణేష్, మార్కెట్ యార్డు వైస్-చైర్మన్ ఉదరు యాదవ్, ఖదీర్, మీరాజ్, జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.